Abn logo
Jun 19 2021 @ 01:03AM

కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

గుత్తిలో వంటావార్పు చేపట్టి నిరసన

ఉరవకొండ/బొమ్మనహాళ్‌ /కళ్యాణదుర్గం/గుత్తి, జూన 18: వైద్య ఆ రోగ్యశాఖ కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలంటూ చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. ఉరవకొండ సీహెచసీ ఎదుట సిబ్బంది నిరసన తెలియజేశారు. మేనిఫెస్టోలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఉరవకొండలో ఉద్యోగులు వెంకటేష్‌, ప్రసాద్‌, నూర్‌, సంపత పాల్గొన్నారు. బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌లో హెల్త్‌ అసిస్టెంట్‌ గోవర్దన ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ర్యా లీ నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసన లో పంచాయతీ కార్యదర్శి హేమాంజలి, వీఆర్వో యుగంధర్‌, ఏఎనఎం రమాదేవి పాల్గొన్నారు.

                 కళ్యాణదుర్గం  ప్రభుత్వాస్పత్రి ఎదుట పారామెడిక ల్‌ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఐకాసా రాష్ట్రకమిటీ క న్వీనర్‌ జాన్సన మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన పారామెడికల్‌ ఉ ద్యోగులకు ఎక్స్‌గ్రేషియా అందేలా చూడాలన్నారు. డీఎస్సీ ద్వారా రోస్టర్‌ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన మెరిట్‌ పద్ధతిలో ఎంపికై గత 20 సంవత్సరాల నుం డి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అనంతరం మెడిక ల్‌ ఆఫీసర్‌ అనుషాకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో నాయకులు  నరసారెడ్డి, గంగరాజు, వీరశేఖర్‌, సతీష్‌, గోవిందరాజులు, సుధాకర్‌, ప్రవీన, రాజ్‌గోపాల్‌ ఠాగూర్‌, తిప్పేస్వామి, వీణకుమారి, కాంతమ్మ, శ్రీదేవి, ల క్ష్మి, అనంతలక్ష్మీ పాల్గొన్నారు. గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తంచేశారు. కొవిడ్‌ కారణంగా 250 మంది కాం ట్రాక్టు ఉద్యోగులను కోల్పోయామన్నారు. బాధిత కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. 18 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన చేపడుతున్నా ప్ర భుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు మక్బుల్‌ సా హెబ్‌, బేతాపల్లి పీహెచపీ రెగ్యులర్‌ సిబ్బంది మద్దతు తెలపగా, కార్యక్రమంలో రామకృష్ణ, వన్నూరువలి, ఆంజినేయులు, షఫ్రూల్లా, జగన, ఈశ్వర మ్మ తదితరులు పాల్గొన్నారు.