పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-06-07T16:55:30+05:30 IST

దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో మోదీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. సడలింపులు ప్రారంభైన జూన్ 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో భౌతిక దూరం నిబంధన సరిగా అమలు కావట్లేదంటూ ఆయా ప్రభుత్వాలు కేంద్రానికి చెప్పినట్టు సమాచారం. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని రాష్ట్రాలు కోరాయట. కేంద్ర ప్రకటించిన సడలింపుల కారణంగా భౌతిక నిబంధనలను అమలు చేసేందుకు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని తేలింది. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు కేంద్ర కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్రాలు భావిస్తున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఢిల్లీ, ముంబైలో  మరణాలు రేటు దిగివచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కతనం విస్తృత ప్రచారంలో ఉంది. మరోవైపు.. కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ తాజాగా ఐదోస్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. కేవలం రెండు రోజుల వ్యవధిలో భారత్.. కేసుల సంఖ్యలో ఇటలీ, స్పెయిన్ దేశాలను దాటిపోయింది. తాజా లెక్కల ప్రకారం..గత 24 గంటల్లో కొత్తగా 9,971 కేసులు వెలుగు చూడటంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. 

Updated Date - 2020-06-07T16:55:30+05:30 IST