సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2022-08-13T05:53:15+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద వస్తుండటంతో రెండు రోజులుగా 26 క్రస్ట్‌ గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు పరుగులెడుతున్న కృష్ణమ్మ

నాగార్జునసాగర్‌, చింతపాలెం, కేతేపల్లి, ఆగస్టు 12: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద వస్తుండటంతో రెండు రోజులుగా 26 క్రస్ట్‌ గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 4,36,259 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటిమట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు)కాగా, శుక్రవారం సాయంత్రానికి 587అడుగులుగా(305.5050టీఎంసీలు) ఉంది. కుడి కాల్వ కు 6,766 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7,937క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 32,927 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 2,400క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, 26 క్రస్ట్‌గేట్ల నుంచి 3,61,602 క్యూసెక్కులు మొత్తం 4,11,932 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి 3,92,623 క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువకు 3,62,946 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు(45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 165.84 అడుగులకు (32.71టీఎంసీలు) చేరింది. దీంతో ప్రాజెక్టులోని 14 గేట్లను 3.5మీటర్ల మేర ఎత్తి  3,57,946క్యూసెకులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1825క్యూసెక్కుల వరద వస్తుండటంతో 12గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టాన్ని 638.20అడుగుల వద్ద నిలకడగా ఉంచుతూ 4,779క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 645 అడుగుల(4.46టీఎంసీల) పూర్తిస్థాయి నీటిమట్టం కాగా, ప్రస్తుతం 638.20అడుగులుగా (2.82టీఎంసీలు) ఉంది. 

Updated Date - 2022-08-13T05:53:15+05:30 IST