Abn logo
May 28 2020 @ 05:20AM

తాళం తీశారు!

  • తెరుచుకున్న వస్త్ర, బంగారం, చెప్పుల దుకాణాలు
  • పలు పట్టణాల్లో సాయంత్రం వరకూ వ్యాపారాలు
  • 64వ రోజూ కొనసాగిన లాక్‌డౌన్‌

ఒంగోలు, మే 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి కొన్ని మినహాయింపులు  లభిం చాయి. పలు రకాల వ్యాపారులకు అధికారుల గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అదేసమయంలో ప్రధా న పట్టణాల్లో సడలింపుల సమయం కూడా పెంచారు. కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉన్న ఒంగోలు నగరంలోనూ సడలింపు సమయంలో నిత్యావసరాలు, కూరగాయలు, పాలు వంటి దుకాణాలే కాక సెలూన్లు, ఫ్యాన్సీ షాపులు, అక్కడక్కడా టీ, కాఫీ దుకాణాలు ఇతరత్రా కొన్నింటిని తెరుస్తున్నారు. నాన్‌ కంటైన్మెంట్‌ ఏరియాల్లో ఇప్పటి వరకు కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు, మరికొన్ని చోట్ల సాయంత్రం దాకా దుకాణాలను అనుమతిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వస్త్ర, బంగారు అభరణాలు, చెప్పుల షాపులను కూడా తెరిచారు. ఆర్టీసీ బస్సులు కూడా పలు రూట్లలో తిరుగుతున్నాడు. ఎండలు తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో పట్టణాల్లో జనసంచారం, వాహనాల రాకపోకల రద్దీ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకూ కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ఉన్న పలు ప్రాంతాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో నాన్‌కంటైన్మెంట్‌గా మారే అవకాశం ఉంది. ఒంగోలు నగరాన్ని కూడా కంటైన్మెంట్‌ నుంచి తొలగించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 64వ రోజైన బుధవారం కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది. 

Advertisement
Advertisement
Advertisement