దివ్యాంగులకు ఫిజియోథెరపీ సేవలు కొనసాగింపు

ABN , First Publish Date - 2020-08-10T10:56:04+05:30 IST

దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గత నాలుగు నెలలుగా దివ్యా ంగులకు నిలిచిపోయిన పిజియోథెరపీ సేవలను..

దివ్యాంగులకు ఫిజియోథెరపీ సేవలు కొనసాగింపు

ఒంగోలువిద్య, ఆగస్టు 9: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గత నాలుగు నెలలుగా దివ్యా ంగులకు నిలిచిపోయిన పిజియోథెరపీ సేవలను కొన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు ఏపీ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.చినవీర భద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో మార్చి చివరి వారం నుంచి దివ్యాంగుల సేవలు, చదు వులు కోసం నిర్వహిస్తున్న భవితా కేంద్రాలను మూసి వేశారు. ఫలితంగా వారికి ఇచ్చే ఫిజియోథెరపీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల వారు  ఇబ్బందిపడు తున్నారు.


ఈక్రమంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లల కు ఫిజియోథెరపీ సేవలు కొనసాగించాలని నిర్ణయిం చారు. తల్లిదండ్రుల అనుమతితో ఫిజియోథెరపిస్టులు పిల్లల ఇళ్ళకు వెళ్ళి వారికి వ్యాయామ సేవలు అందిం చమన్నారు. ప్రధానంగా గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లోని పిల్లల కు మాత్రమే ఈ సేవలు అందుతాయి. ప్రతిరోజు ము గ్గురు పిల్లల ఇళ్లకు వెళ్ళి ఒక్కొక్కరికి కనీసం గంటపా టు ఫిజియోథెరపీ చేయాలి. అలాగే కొవిడ్‌ నిబంధన లు తప్పకుండా పాటించాలి. ముఖానికి మాస్కు, చేతు లకు గ్లౌజులు ధరించడంతో పాటు హ్యాండ్‌ శానిటైజర్‌ వినియోగించాలి. ప్రతి ఫిజియోథెరపిస్టు వారంలో మూడు రోజులపాటు ముగ్గురేసి విద్యార్థులకు సేవలం దించాలి. నెలమొత్తంలో 12 విజిట్‌లు చేయాలని ఆ ఉ త్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2020-08-10T10:56:04+05:30 IST