కంటైన్మెంట్‌ జోన్‌గా గొల్లవిల్లి

ABN , First Publish Date - 2021-05-08T06:29:58+05:30 IST

కరోనా మృతులు అధికంగా నమోదవుతున్న గొల్లవిల్లిపై మంత్రి విశ్వరూప్‌ దృష్టి పెట్టారు. ఆయన ఆదేశాలతో గ్రామాన్ని వైద్యాధికారులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

కంటైన్మెంట్‌ జోన్‌గా గొల్లవిల్లి

ఉప్పలగుప్తం, మే 7: కరోనా మృతులు అధికంగా నమోదవుతున్న గొల్లవిల్లిపై మంత్రి విశ్వరూప్‌ దృష్టి పెట్టారు. ఆయన ఆదేశాలతో గ్రామాన్ని వైద్యాధికారులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. శుక్రవారం స్థానిక హైస్కూల్‌లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అడిషనల్‌ డీఎం అండ్‌హెచ్‌వో సీహెచ్‌ పుష్కరరావు ఆధ్వర్యంలో వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది గ్రామంలో స్వల్ప అస్వస్థత ఉన్న వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించారు. ఈనెల8వ తేదీ నుంచి స్థానిక హైస్కూల్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు గ్రామస్తులందరికీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించే చర్యలు చేపట్టినట్టు వైద్యాధికారి తెలిపారు. ఇన్‌చార్జి తహశీల్దార్‌ జి.ఝాన్సీ, ఎంపీడీవో కె.విజయప్రసాద్‌, ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గొల్లవిల్లిని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.



Updated Date - 2021-05-08T06:29:58+05:30 IST