సోదాల్లో దొరికిన ఆ రూ. 150 కోట్లు కంటైనర్‌లో తరలింపు

ABN , First Publish Date - 2021-12-25T00:28:23+05:30 IST

ఓ వ్యాపారవేత్త ఇంటిపై ఐటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ(డీజీజీఐ) అధికారులు దాడిచేసి స్వాధీనం చేసుకున్న రూ. 150

సోదాల్లో దొరికిన ఆ రూ. 150 కోట్లు కంటైనర్‌లో తరలింపు

కాన్పూరు: ఓ వ్యాపారవేత్త ఇంటిపై ఐటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ(డీజీజీఐ) అధికారులు దాడిచేసి స్వాధీనం చేసుకున్న రూ. 150 కోట్ల నగదును తరలించేందుకు కంటైనర్‌ను తీసుకొచ్చారు. వ్యాపారవేత్త ఇంటిపై గురువారం మొదలైన దాడులు 24 గంటలపాటు కొనసాగి నేడు ముగిశాయి. స్వాధీనం చేసుకున్న సొమ్మును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్‌ను కూడా తెప్పించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎప్), బృందాలు, రెండు పోలీసు కార్ల భద్రత నడుమ నగదు నింపిన కంటైనర్‌ను బ్యాంకుకు తరలించారు.


షికార్ బ్రాండ్ పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల కంపెనీ అయిన కాన్పూరులోని త్రిమూర్తి ఫ్రాగ్నెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కంపెనీతోపాటు, గణపతి రోడ్ కేరియర్స్ కార్యాలయం, గోడౌలన్లలో ఈ సోదాలు జరిగాయి. సరుకులను తరలించేటప్పుడు ఈ-వే బిల్లుల నుంచి తప్పించుకునేందుకు ఉనికిలో లేని కంపెనీల పేర్లపై పలు ఇన్వాయిస్‌లు తయారుచేసినట్టు అధికారులు గుర్తించారు.  ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు లేకుండా ఫ్యాక్టరీ నుంచి క్లియర్ చేసిన నాలుగు ట్రక్కులను ఫ్యాక్టరీ ప్రాంగణం వెలుపల అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. జీఎస్టీని ఎగ్గొట్టేందుకు సృష్టించిన 200కుపైగా నకిలీ ఇన్వాయిస్‌లను గణపతి రోడ్ కేరియర్స్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రూ. 1.01 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-12-25T00:28:23+05:30 IST