Advertisement
Advertisement
Abn logo
Advertisement

కంటైనర్‌ సహాయ డ్రైవర్‌ మృతి

షోరూమ్‌ ప్రహరీని ఢీకొనడంతో ఘటన

నెల్లూరు(క్రైం) అక్టోబరు 14: అతి వేగంతో వస్తున్న కంటైనర్‌ అదుపుతప్పి జాతీయరహదారి పక్కన ఉన్న ఓ షోరూమ్‌ ప్రహరీని ఢీకొంది. బుధవారం అర్ధరాత్రి నగర శివారులో జరిగిన  ఈ ప్రమాదంలో సహాయ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.  ట్రాఫిక్‌ పోలీసుల సమాచారం మేరకు కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన బి. వీరబాబు కంటైనర్‌ డ్రైవర్‌గా, కాకినాడ రాయలువారిపాలేనికి చెందిన వి. మురళీకృష్ణ(43) సహాయ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కేరళకు  వెళ్లిన వారిద్దరు తిరిగి కాకినాడకు ప్రయాణం అయ్యారు. వీరబాబు కంటైనర్‌ను నడుపుతుండగా మురళీకృష్ణ క్యాబిన్‌లో నిద్రపోతున్నాడు. బుధవారం అర్ధరాత్రి కంటైనర్‌ సరిగ్గా నగర శివారులో  జాతీయరహదారిపై మారుతీ సుజికీషోరూమ్‌ వద్దకు వచ్చే సరికి డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించలేక  అదుపుతప్పి ఆ షోరూమ్‌ ముందు ఉన్న బైక్‌ను, తర్వాత  ప్రహరీని ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో నిద్రిస్తున్న మురళీకృష్ణ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. నేషనల్‌ హైవే టెక్నీషియన్‌ మణి ఫిర్యాదు మేరకు నార్త్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ సి. సుబ్రహ్మంణ్యంరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement