Abn logo
May 16 2021 @ 23:23PM

అత్యవసర సేవలకు సంప్రదించండి

వంగర: మండలంలోని ఏ గ్రామంలోనైనా కరోనా రోగులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే తక్షణం తమను సంప్రదిస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్‌ ఐజాక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. మండలంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నందున ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసిందన్నారు. కరోనా రోగులకు ప్రాణవాయువుతో పాటు వాహనం ఏర్పాటుకు అవకాశం కల్పించిందన్నారు. అవసరమైన వారు తహసీల్దార్‌ కార్యాలయం ఫోన్‌ నెంబర్లు 7207227126,  8333988785, లేదా పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.


హోం ఐసోలేషన్‌ వారికి వాకర్స్‌ క్లబ్‌ అండ

నరసన్నపేట: పట్టణంలో కరోనాతో బాధపడుతూ హోం ఐసోలే షన్‌లో ఉన్న వారికి వాకర్స్‌ క్లబ్‌ అండగా నిలుస్తుందని సభ్యుడు ఊన్న వెంకటేశ్వరరావు తెలిపారు. మూడు రోజులుగా పట్టణంలో బాధితులకు, వారి కుటుంబ సభ్యులు ఆహారం అందిస్తున్నామన్నారు. ఆదివారం 53 మందికి మూడు పూటలా భోజనాన్ని అందించామన్నారు. భోజన పదార్థాలు అవసరమైన వారు 9014066651 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. 

 

Advertisement