పది నిమిషాల్లోనే... 'kiji ఆన్‌లైన్ డెలివరీలు...

ABN , First Publish Date - 2022-01-23T23:58:46+05:30 IST

పది నిమిషాల సమయంలో జరుగుతోన్న ఆనే్‌లైన్ డెలివరీలు షాపర్లను ఆశ్చర్యానికి, అదే సమయంలో కలవరపాటుకు కూడా గురిచేస్తున్నాయి.

పది నిమిషాల్లోనే... 'kiji ఆన్‌లైన్ డెలివరీలు...

ఆశ్చర్యపరుస్తోన్న ‘వేగం’...

అదే సమయంలో... రోడ్డు భద్రతకు కూడా ముప్పే...

హైదరాబాద్/న్యూఢిల్లీ : పది నిమిషాల సమయంలో జరుగుతోన్న ఆనే్‌లైన్ డెలివరీలు షాపర్లను ఆశ్చర్యానికి, అదే సమయంలో కలవరపాటుకు కూడా గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే... వినియోగదారులను ‘ఆన్‌లైన్’ డెలివరీలు రోజురోజుకు అధికసంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. అమెజాన్, అమెజాన్ ఫ్లిప్‌కార్ట్, భారతీయ మిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్  తదితర సంస్థలు... దేశవ్యాప్తంగా 600 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి.  ఈ నేపధ్యంలోనే... సాఫ్ట్‌బ్యాంక్ మద్దతున్న బ్లింకిట్, దాని ప్రత్యర్ధి జెప్టో సిబ్బందిని నియమించుకునే క్రమంలో పోటీ పడుతున్నాయి కూడా. ఈ క్రమంలోనే ‘మార్కెట్’లో అధిక భాగం వాటాను దక్కించుకునేందుకుగాను ‘పది నిమిషాల్లోనే డెలివరీ’ని తెరమీదకు తెచ్చాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో... తమ స్టోర్లను సైతం ఆయా సంస్థలు విస్తరిస్తూ వస్తున్నాయి. మరోవైపు ఎక్కడికక్కడ, సాధ్యమైనన్ని స్టోర్లను తెరవడం, పెద్దసంఖ్యలో రైడర్లను ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలను సంస్థలు చేపడుతున్నాయి. 


అయితే... ఈ మార్కెటింగ్ క్రమంపై కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇరవై నాలుగు గంటల్లో డెలివరీలు అందించే సంస్థలు దెబ్బతినే ప్రమాదముందని, అంతేకాకుండా... నాణ్యత విషయంలో కూడా లోపాలు తలెత్తే అవకాశముంటుందని ఐటీ విశ్లేషకుడు అశ్విన్ మెహతా చెబుతున్నారు. కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో... కిందటి సంవత్సరం... 300 మిలియన్ డాలర్ల విలువైన వస్తు, వాణిజ్య రంగం పదిహేను రెట్లు పెరిగి, 2025 నాటికి ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ‘రెడ్‌సీర్’ పరిశోధనా సంస్థ చెబుతోంది. 


బ్లింకిట్, జెప్టో సంస్జలు స్టాన్‌ఫోర్డ్కు చెందిన ఇద్దరు వ్యాపారులు ప్రారంభించిన ఈ ‘ఆన్‌లైన్ డెలివరీ’ విధానం వినియోగదారులను విపరీతంగా ఆకర్షించింది. మొత్తంమీద ఈ విధానం సౌకర్యవంతంగా ఉందని, తమ జీవిత విధానాలనే మార్చివేసిందని శర్మిష్ట అనే మహిళ పేర్కొంది. వంట గదిలో సామాగ్రి నిండుకున్నప్పుడు తాము బ్లింకిట్ వేపు దృష్టి సారిస్తున్నామని పేర్కొంది. భారత రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తోన్న 75 ఏళ్ళ వృద్ధుడు ... టాటా ఆన్‌లైన్ బిగ్‌బాస్కెట్‌ను తరచూ వినియోగిస్తున్నారు. కాగా వేగవంతమైన డెలివరీలకు సంబంధించి ఐరోపా, అమెరికా దేశాల్లో ఆన్‌లైన్ విధానం మరింత మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదాలకు దారితీసేలా ఉంటే రహదారుల నేపథ్యంలో... భారతదేశంలో కొంత భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ‘పది నిమిషాల్లోనే డెలివరీ విధానం చాలా అద్భుతమైనది’ అని రహదారుల శాఖ మాజీ కార్యదర్శి విజయ్ చిబ్బర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-23T23:58:46+05:30 IST