Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 15 Jan 2022 00:00:00 IST

ఆకట్టుకున్న ఆధునిక గాడ్జెట్స్‌

twitter-iconwatsapp-iconfb-icon
ఆకట్టుకున్న ఆధునిక గాడ్జెట్స్‌

కన్జూమర్‌ ఎలక్ర్టానిక్‌ షో - 2022


కొవిడ్‌తో మనుషుల మధ్య భౌతిక దూరం పెరిగింది. అంతే తప్ప పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఇటీవల లాస్‌ వెగాస్‌లో ముగిసిన కన్జూమర్‌ ఎలకా్ట్రనిక్‌ షో-2022 అందుకు మంచి ఉదాహరణ.  సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ప్రదర్శనలో ఉంచిన పది గాడ్జెట్స్‌ సందర్శకులను ఆకట్టుకున్నాయి. వాటిలో గాలిని పరిశుద్ధం చేసే హెడ్‌ ఫోన్లు మొదలుకొని హార్ట్‌ రేట్‌ను గుర్తించే బల్బుల వరకు చాలానే ఉన్నాయి.


ఎల్‌జీ వాషింగ్‌ మెషిన్‌: లోడ్‌ను బట్టి సర్ఫ్‌ 

ఎల్‌జీ ఎఫ్‌ఎక్స్‌ వాషింగ్‌ మెషిన్‌ - వేసిన బట్టల లోడ్‌, ఫ్యాబ్రిక్‌ తరహా,  వాటికి పట్టుకున్న మురికి పరిణామం లేదా లెవెల్‌ను గ్రహిస్తుంది. దాన్నిబట్టి ఎంత డిటర్జెంట్‌, ఉతికేందుకు పట్టే సమయాన్ని లెక్క కడుతుంది. దీంతో డిటర్జెంట్‌ ఎక్కువై బట్టలు పాడైపోతాయనే బాధ లేదు. అలాగే మెషిన్‌లో ఉన్న ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్‌ టెంపరేచర్‌ ద్వారా ఎంత సేపట్లో ఆ దుస్తులు డ్రై అవుతోయో తేలుస్తుంది. డ్రయింగ్‌ అన్నింటికీ సమానంగా పూర్తయ్యేందుకు వీలుగా ఆటోమేటిక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేస్తుంది. 


ఆసస్‌ జెన్‌బుక్‌ 17ఫోల్డ్‌ ఓలెడ్‌

ఫోల్డబుల్‌ లాప్‌టాప్‌లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకసారి ఉపయోగం పూర్తయ్యాక దాన్ని ఫోల్డ్‌చేసి పక్కన పడేస్తారు. అయితే  దాన్ని మల్టీపర్పస్‌గా వాడుకునేందుకు వీలుగా ప్రాక్టికల్‌ ఐడియాతో ముందుకు తీసుకువచ్చింది ‘ఆసస్‌’. 17 ఇంచీల లాప్‌టాప్‌ మడిస్తే 12 ఇంచీల టాబ్లెట్‌గా మారుతుంది. శక్తిమంతమైన స్పీకర్‌ సిస్టమ్‌, ప్రాసెసర్‌ దీనికి ఉన్నాయి. ఈ ఏడాదే దీన్ని విడుదల చేయనున్నారు. త్వరలో ఇండియన్‌ మార్కెట్లోకీ రావచ్చు. 


కోహ్లెర్‌ పర్ఫెక్ట్‌ఫిల్‌

బాత్‌టబ్‌లో ఎంత నీరు ఉండాలనే విషయాన్ని నిర్ధారించడానికి టెక్నాలజీ రూపుదిద్దుకుంది. ‘కొహ్లెర్‌’ కంపెనీ పర్ఫెక్ట్‌ఫిల్‌ పేరుతో గాడ్జెట్‌ను తీసుకు వచ్చింది. ఇది స్మార్ట్‌ డ్రెయిన్‌, డిజిటల్‌/యాప్‌ కంట్రోలర్‌, బాత్‌ ఫిల్లర్‌ సమాహారం. యాప్‌ లేదంటే వాయిస్‌ కమాండ్‌తో కోరుకున్న టెంపరేచర్‌తో నీరు లభ్యమవుతుంది. టబ్‌ ఉపయోగించే వారి కోసం ఎంత లోతు వరకు నీరు ఉండాలనేది కూడా తేలుస్తుంది. ఈ మే నెలలో ఇది విడుదల కానుంది. అయితే భారత్‌లోకి వస్తుందా రాదా అన్నది తెలియదు.


హెడ్‌ఫోన్‌లో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌

‘ఎయిర్‌ విధ’ పేరుతో ఇబ్లే కంపెనీ నెక్‌బ్యాండ్‌ బిల్ట్‌ ఇన్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను తీసుకువచ్చింది. హెడ్‌ఫోన్‌లోనే బిల్ట్‌ ఇన్‌గా ఉంటుంది అన్నమాట. ఎయిర్‌ ప్యూరిఫైయర్‌గా, హెడ్‌ఫోన్‌గా రెంటికి వాడుకుంటే బ్యాటరీ ఎనిమిది గంటలు పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒక్కదానిగా వాడుకుంటే 30 గంటలు పనిచేస్తుంది. వేరబుల్‌ ప్యూరిఫైయర్‌ ఉత్పత్తులకు ‘ఇబ్లే’ పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. 


టీసీఎల్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌

స్మార్ట్‌ గ్లాసెస్‌ అనేవి కొత్త కానప్పటికీ టీసీఎల్‌ తీసుకువచ్చిన వీటిని రిఫైన్డ్‌ కళ్ళద్దాలుగా చెప్పొచ్చు. 3డి ఇమేజ్‌కు తోడు డ్యూయల్‌ స్పీకర్స్‌ ఉంటాయి. రెండు మైక్రో ఓలెడ్‌ డిస్‌ప్లేలు, రెండు ఇంటర్‌చేంజబుల్‌ ఫ్రంట్‌ లెన్స్‌లు ఉంటాయి. మూడు నాలుగు నెలల్లో ఇవి అందుబాటులో రానున్నాయి. టిపి - లింక్‌ ఆర్చర్‌ ఎఎక్స్‌ఇ200

ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ బాగా రావాలంటే రౌటర్‌ పెట్టుకునే విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘ఆర్చర్‌ ఏఎక్స్‌ఇ 200 టీపీ లింక్‌ రౌటర్‌’ డివైజ్‌ సిగ్నల్స్‌కు అనుగుణంగా ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్‌ చేసుకుంటుంది. అంటే ఏ డైరెక్షన్‌లో రౌటర్‌ ఉంటే బాగా సిగ్నల్‌ వస్తుందో ఆటోమేటిక్‌గా అటు టర్న్‌ అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఇది విడుదల కానుంది. 


శాంసంగ్‌ ఎకో రిమోట్‌

శాంసంగ్‌ తీసుకువచ్చిన ఎకో రిమోట్‌ సోలార్‌ ఎనర్జీతో చార్జ్‌ అవుతుంది. అంతేకాదు ఈ ఏడాది శాంసంగ్‌ మరో ముందడుగు వేస్తోంది. రేడియో ఫ్రీక్వెన్సీతో రిమోట్‌ చార్జింగ్‌ చేసే పద్ధతిని తీసుకురానుంది. వైఫై నుంచి సిగ్నల్స్‌ మాదిరిగా రేడియో ఫ్రీక్వెన్సీ సహకారంతో డివైస్‌కు చార్జింగ్‌ చేసుకోవచ్చు.

ఆకట్టుకున్న ఆధునిక గాడ్జెట్స్‌

పోజియో క్రాడల్‌

వైర్‌లెస్‌ చార్జర్లు మనకు తెలిసిందే. పోజియో క్రాడల్‌ అందుకు భిన్నం. ఒకరకంగా వైర్‌లెస్‌ చార్జర్లకిఅప్‌డేషన్‌గా దీనిని చెప్పొచ్చు. వ్యక్తిగత సంభాషణలను రహస్యంగా వినడాన్ని ఇది నిరోధిస్తుంది. అలాగే ఈ వైర్‌లెస్‌ చార్జర్‌లో ఫోన్‌ ఉంచితే చార్జింగ్‌ కూడా జరుగుతూ ఉంటుంది. మరోవైపు మాట్లాడుకోవచ్చు. పైపెచ్చు వినియోగదారుడి ప్రైవసీని ఇది పూర్తిగా కాపాడుతుంది. ఈ టెక్నాలజీకి పేటెంట్‌ కూడా పొందారు. 


ఆకట్టుకున్న ఆధునిక గాడ్జెట్స్‌

శాంసంగ్‌ ఫ్రీస్టయిల్‌ ప్రొజెక్టర్‌  

స్పీకర్‌, ప్రొజెక్టర్‌, అన్ని వైపులకు వెలుగు - అంతా కలిపి మోసుకుపోగలిగే డివైస్‌ అని శాంసంగ్‌ చెబుతోంది. 180 డిగ్రీల మేర రొటేట్‌ అవుతుంది. స్ర్కీన్‌ అవసరం లేకుండా ఎక్కడైనా వీడియోను చూడగలిగే సౌలభ్యం దీని సొంతం. అమెరికాలో విడుదల చేసిన ఈ డివైస్‌ భారత్‌ సహా వివిధ దేశాల మార్కెట్లలోకి త్వరలో రానుంది. 

ఆకట్టుకున్న ఆధునిక గాడ్జెట్స్‌

హార్ట్‌రేట్‌ని మెజర్‌ చేసే బల్బు

అమెరికాలో ప్రసిద్ధి చెందిన లైటింగ్‌ కంపెనీ ‘సెంగ్లెడ్‌’. దీని ఇటీవలి ప్రొడక్ట్‌  - స్మార్ట్‌ హెల్త్‌ మానిటరింగ్‌ లైట్‌. ఇది వైఫై, బ్లూటూత్‌ అనుసంధానించేలా ఉంటుంది. రాడార్‌ టెక్నాలజీని ఉపయోగించి ఇది ఆరోగ్యాన్ని మానిటర్‌ చేస్తూ ఉంటుంది. దీంతో నిద్ర, గుండె స్పందన రేటును అలాగే బాడీ టెంపరేచర్‌ సహా పలు విషయాలను తెలుసుకోవచ్చు. అయితే బల్బు ఇంకా అభివృద్ధి పర్చే దశలోనే ఉంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.