భవన నిర్మాణ పనులకు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి

ABN , First Publish Date - 2022-06-26T04:37:37+05:30 IST

ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

భవన నిర్మాణ పనులకు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి

రాయచోటి(కలెక్టరేట్‌), జూన్‌25: ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటికే చే ర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, రైతు భరో సా కేంద్రాలు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీలు త్వరగా అందుబాటు లోకి తీసుకురావాలన్నారు.

కాన్ఫరెన్స్‌ అనంతరం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రైవేటు భవనాల్లో సచివాలయాలు ఏర్పా టు చేశారని, త్వరగా భవన నిర్మాణాలు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సురేష్‌కుమార్‌కు సూచించారు. భవన నిర్మాణాలకు సంబంధించి అవసరం మేరకు సిమెంటు ప్రతిపాదనలు పంపాలన్నారు. బిల్లులు కూడా సకాలంలో పడుతున్నాయని, పనుల్లో వేగం పెంచాలన్నారు. భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. వీసీలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌ సత్యనారాయణ, పంచా యతీరాజ్‌ ఎస్‌ఈ సురేష్‌కుమార్‌, డ్వామా పీడీ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T04:37:37+05:30 IST