ఎట్టకేలకు మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-28T06:22:51+05:30 IST

పట్టణ సమీపంలో గొర్రెల పెంపక క్షే త్రం వద్ద ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ ప నులు యేడాది తరువాత ఎట్టకేలకు ప్రారంభించారు.

ఎట్టకేలకు మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభం
యంత్రాలతో భూమిని చదును చేస్తున్న దృశ్యం

పెనుకొండ, మే 27: పట్టణ సమీపంలో గొర్రెల పెంపక క్షే త్రం వద్ద ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ ప నులు యేడాది తరువాత ఎట్టకేలకు ప్రారంభించారు. ప్రభుత్వం గత యేడాది రాష్ట్రంలో 14 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కొత్తగా మెడికల్‌ కళాశాలలను మంజూరు చేసింది. హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని పెనుకొండ పట్టణంలో 63 ఎకరాల్లో రూ.475 కో ట్ల అంచనాతో 2021 మే 31న కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. అప్ప టి మంత్రి శంకర్‌నారాయణ చేతులమీదుగా భూమిపూజ చేశారు. భవన నిర్మాణ పనులను మెగా సంస్థకు అప్పగించారు. వెంటనే పనులు కూడా ప్రారంభించారు. వారం రోజులు తిరగకముందే ప నులను అర్ధంతరంగా నిలిపేశారు. నిర్మాణం కోసం తీసుకొచ్చిన కంకర, ఇసుక, ఇనుము తదితర సామగ్రిని అక్కడి నుంచి తరలించారు. పెనుకొండ నుంచి మెడికల్‌ కళాశాల శాశ్వతంగా తరలిపోతుందని స్థానికులు అప్పట్లో ఆందోళనకు గురయ్యారు. రియల్‌ వ్యాపారస్థులు కుదేలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నపళంగా మెగా సంస్థ ఏడాది తరువాత నిర్మాణ పనులు ప్రారంభించింది. ఎక్సాకవేటర్‌, ట్రాక్టర్‌ ద్వారా భూమి చదును పనులను వేగవంతం చేశారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తీసుకొచ్చి నిలువ చే శారు. మళ్లీ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం కావడం తో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 


Updated Date - 2022-05-28T06:22:51+05:30 IST