దాతల సహకారంతో కల్యాణ మండప నిర్మాణం

ABN , First Publish Date - 2021-04-14T04:53:53+05:30 IST

దాతల సహకారంతో కల్యాణ మండప నిర్మాణం

దాతల సహకారంతో కల్యాణ మండప నిర్మాణం
కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

షాద్‌నగర్‌ అర్బన్‌: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగార ంగా వెలుగొందుతున్న షాద్‌నగర్‌లోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దాతల సహకారంతో నిర్మించిన కల్యాణ మండపాన్ని మంగళవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ప్రారంభించారు. వనపర్తి సంస్థానాధీశుడు రాజా సవాయి వెంకట్‌రెడ్డి షాద్‌నగర్‌కు ముఖద్వారంగా 300సంవత్సరాల కిత్రం నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ స ముదాయంలో వైకుంఠ ఏకాదశిన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ సౌకర్యాలు కల్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు నేతృత్వంలో దాతల సహకారంతో రూ.13లక్షలతో మండపాన్ని నిర్మించారు. యేటా బ్రహ్మోత్సవాలతో పాటు ఇతర వైదిక కార్యక్రమాలను నిర్వహించేందుకు మండపాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. దాతలను బక్కని నర్సింహులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ గణేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేంద ర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందె బా బయ్య, కౌన్సిలర్లు కానుగు అంతయ్య, ప్రతా్‌పరెడ్డి, ఈగ వెంకట్‌రాంరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, పట్టణ ప్రముఖులు బండారు రమే ష్‌, పలభట్ల బాల్‌రాజ్‌, పలభట్ల మోహన్‌రావు, వెంకటసాయీశ్వర్‌రెడ్డి, నర్సింహులు, కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T04:53:53+05:30 IST