ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-07-28T04:58:07+05:30 IST

సకాలంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆగస్టులో సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, ఎస్పీ, జేసీ

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎం ఆదేశాలు


కడప (కలెక్టరేట్‌), జూలై 27 : సకాలంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆగస్టులో సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం  నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొవిడ్‌-19, ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధత, జాతీయ ఉపాఽధి హామీ పథకం పనులు తదితరాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో సీఎం సమీక్షించారు. కార్యక్రమానికి జిల్లా నుంచి కలెక్టర్‌ సి.హరికిరణ్‌తో పాటు ఎస్పీ అన్బురాజన్‌, జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, సీఎం సాయికాంత్‌వర్మ, ధర్మచంద్రారెడ్డి, ధ్యాన్‌చంద్ర, డీఆర్వో మలోల, సహాయ కలెక్టర్లు హాజరయ్యారు. సీఎం వీసీ ముగిసిన అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు థర్డ్‌ వేవ్‌ కొవిడ్‌ కట్టడికి పటిష్టమైన చర్యలు చేపడుతూనే ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణను విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీరు, డ్రైనేజి, రోడ్లు, కాలువలు, విద్యుత్‌ సమస్యలు ఉండకూడదన్నారు. సచివాలయ ప్రాంగణాల్లో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనాలతో పాటు సచివాలయ, రైతు భరోసా, హెల్త్‌ క్లీనిక్‌ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీవో వేణు గోపాల్‌, డ్వామా పీడీ యధుభూషణ రెడ్డి, డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌, ఎస్‌ఎ్‌సఏ పీవో ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T04:58:07+05:30 IST