ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-06-29T05:30:00+05:30 IST

మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న జగనన్న లే-ఔట్లలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు నాగలక్ష్మి సెల్వ రాజన్‌ పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

కలెక్టర్‌ నాగలక్ష్మి

 గుత్తి, జూన్‌ 29: మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న జగనన్న లే-ఔట్లలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు నాగలక్ష్మి సెల్వ రాజన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాడిపత్రి రోడ్డు, నేమతాబాద్‌కు సమీపంలోని, చెట్నేపల్లి సమీపంలోని జగనన్న లే-ఔట్లను కల్టెక్టరు పరిశీ లించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణాలను ఆమె పర్యవేక్షించారు. లబ్ధి దారులకు మెటీరియల్‌, బిల్లుల విషయంలో ఏమాత్రం జాప్యం లేకుండా చూడాలన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలను చేపట్టేలా చూడాలన్నారు. ఒకవేళ నిర్మాణం చేపట్టని పక్షంలో స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకుని కంటైన్మెంటు పంపి పథకాన్ని రద్దుచేసుకుం టున్నట్లు సమ్మతిని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్ర, ము న్సిపల్‌ కమిషనరు గంగిరెడ్డి, తహసీల్దారు మహబూబ్‌ బాషా, హౌసింగ్‌ డీఈఈ రామకృష్ణారెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఏఈ రేవంత్‌, మున్సిపల్‌ ఏఈ శరత్‌ చంద్ర, హౌసింగ్‌, విద్యుత్‌ శాఖ ఏఈలు వెంకటేశ్వర్లు, సుకుమార్‌,  పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T05:30:00+05:30 IST