ధర్మారం మండలంలో రైతువేదికల నిర్మాణం పూర్తి

ABN , First Publish Date - 2020-10-27T10:45:04+05:30 IST

ధర్మారం మండలంలో రైతు వేదికల నిర్మా ణాలు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదిక లను నిర్మించాలనే లక్ష్యంతో ఓ గొప్ప నిర్ణయం

ధర్మారం మండలంలో రైతువేదికల నిర్మాణం పూర్తి

మంత్రి ఆదేశాలతో ఆరు గ్రామాల్లో వేగంగా పనులు

త్వరలో ప్రారంభం


ధర్మారం, అక్టోబరు 26 : ధర్మారం మండలంలో రైతు వేదికల నిర్మా ణాలు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదిక లను నిర్మించాలనే లక్ష్యంతో ఓ గొప్ప నిర్ణయం తీసుకుని నిధులను మంజూరుచేసింది. వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు గ్రామీణ ప్రాం తాల నుంచి అనేక వ్యయప్రయాసాలు పడి మండల కేంద్రానికి రావా ల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలతో ఆ క్లస్టర్‌ గ్రామంలోనే రైతు వేదికలను నిర్మించింది. ధర్మారం మండలంలో మల్లాపూర్‌, కటికె నపల్లి, ధర్మారం, నందిమేడారం, బొట్లవనపర్తి, దొంగతుర్తి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22లక్షలు మంజూరు చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ధ్వారా రూ.12లక్షలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రూ. 10 లక్షలను మంజూరు చేయడంతో మండలంలో శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ రైతు వేదికను అడ్డం 33 ఫీట్లు, పొడవు 62 ఫీట్లు, రెండు గదులు, ఒక హాలు ఉండేలా ని ర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నమూనా ప్రకారంగానే రైతు వేదికలను నిర్మించారు. ఇందులోనే ఒకటి వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారి(ఏఈవో)కు, మరొకటి రైతుబంధు సమితికి ఉండేలా నిర్మించారు.. రైతు వేదికల నిర్మాణాలను దసరా వరకు పూర్తిచేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదే శాల వేరకు అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి పూర్తి చేయించారు. ఈ రైతు వేదికల నిర్మించడం వలన రైతులకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది.


రైతులు సాగు చేసే పంటలపై అవగా హన, పంటల మార్పిడిపై వ్యవసాయ శాఖ అధికారులు ఆయా గ్రామాలకు చెందిన రైతులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా అకాల వర్షాలు కురిస్తే పంట నష్టం తదితర అంశాలను నేరుగా రైతు లు అందుబాటులో ఉన్న రైతు వేదికల వద్దకు వచ్చి వివరించుకోవడా నికి వీలు కలుగుతుంది. గతంలో పంటల సాగు విధానంపై మండల కేంద్రంలో ఉండే వ్యవసాయ శాఖ కార్యాలయంకు వెళ్లాల్సి ఉండేది. కానీ అలాంటి సమస్య రాకుండా రైతువేదికల వద్దనే సమస్యలు పరి ష్కారమయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో రైతులు హర్షిస్తు న్నారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమ న్వయంతో రైతువేదికల నిర్మాణాలను పూర్తి చేసి సిద్ధం చేశారు. మండ లంలోని ఆరు గ్రామాల్లో రైతు వేదికలను నిర్మించి వాటికి రంగలు వేసి ప్రారంభానికి సిద్దం చేశారు.  


మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు..ముత్యాల కరుణశ్రీ, ఎంపీపీ ధర్మారం

త్వరలోనే రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌చే రైతు వేదికలను ప్రారం భించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుని రైతు వేదికలను నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఈమేరకు మండలంలో 6గ్రామాల్లో రైతు వేదికల నిర్మా ణాలకు రూ. కోటి32లక్షల నిధుల ను ప్రభుత్వం మంజూరుచేయగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశాల మేరకు వ్యవ సాయ శాఖ, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో పూర్తయ్యాయి. ఈ రైతు వేదికల నిర్మాణాలతో అన్ని గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వం మంజూరు చేసే పథకాలపై క్షేత్రస్థాయి అధికారులు అవగాహన కల్పిస్తారు.


రైతుకు మంజూరైన రుణాలను నేరుగా రైతుకే చెందేలా సౌకర్యాన్ని  ప్రభుత్వం కల్పిస్తుంది. పంటల సాగు విధాలనాలపై వ్యవసాయ నిపుణులు సూచించే సూచనలను కూడా క్షేత్ర స్థాయి లో అందుబాటులో ఉండే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులు పూర్తి స్థాయిలో రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండలం లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలోనే రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా ప్రారంభించ డానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 

Updated Date - 2020-10-27T10:45:04+05:30 IST