ఏపీ టిడ్కో ఇళ్లు రద్దు

ABN , First Publish Date - 2020-07-02T10:57:34+05:30 IST

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌ పథకంలో ఆయోమయం వెంటాడుతోంది. రాష్ట్ర

ఏపీ టిడ్కో ఇళ్లు రద్దు

పునాదులు దాటలేదంటూ 

5,076 ఇళ్ల నిర్మాణం నిలుపుదల 

లబ్ధిదారులకు స్థలాల కేటాయింపు


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌ పథకంలో ఆయోమయం వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణ యం తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనూ హ్య నిర్ణయాలతో ఏపీ టిడ్కో అధికారులను గందరగోళానికి గురిచేస్తోంది. జిల్లాలో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టిన అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లలో పునాదులు దాటని ఇళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అందులో నూ వివక్షను ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రెండు విడతల్లో ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది.


రెండు విడతలకు సంబంధించి జిల్లాలో 5,076 ఇళ్లను రద్దు చేశారు. అత్యధికంగా ఏలూరులో 4,050 ఇళ్లు ఉన్నాయి. వాస్త వానికి రెండో విడతలో ఏలూరులో 6,480, జంగారెడ్డిగూడెంలో 1,056, నిడదవోలు 1,248, తణుకులో 912, కొవ్వూరులో 480 ఇళ్లు నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వా త 25 శాతం పూర్తి కాని ఇళ్లకు బిల్లులు నిలిపివేయాలని ఆదే శాలు జారీచేసింది. దీంతో జిల్లాలో రెండో విడత అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. వాటి నిర్మాణం వివి ధ దశల్లో ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


పునాదిస్థాయి దాటని ఇళ్లను రద్దు చేస్తూ ఉత్తర్వు లు జారీచేసింది. జిల్లాలో కొన్ని పట్టణాలకే రద్దు నిర్ణయాన్ని వర్తింపచేసింది. రెండో విడత నిర్మాణంలో వున్న అర్బన్‌ హౌసింగ్‌కు సంబంధించి ఏలూరులో 4,050, జంగారెడ్డిగూడెం లో 194, నిడదవోలులో 94 ఇళ్లు రద్దుచేశారు. కొవ్వూరు, తణు కు పట్టణాల్లో యథాతథంగానే ఉన్నాయి. తొలి విడతలో  ఏపీ టిడ్కో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లులో నిర్మాణం చేప ట్టిన ఇళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. భీమవరం, పాలకొల్లులో 1,888 ఇళ్లు నిర్మాణానికి నోచుకోలేదు. రహదారులు లేవని ఎల్‌అండ్‌టీ సంస్థ వాటిని నిర్మించలేదు.  తొలి విడతలో నిర్మా ణానికి నోచుకోని ఇళ్లకు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులు ఖరారు చేశారు.


నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉంది. అంత లోనే పాలకొల్లులో నిర్మాణానికి నోచుకోని 640 ఇళ్లను రద్దు చేశారు. భీమవరంలో నిర్మాణం చేపట్టని 1248 ఇళ్లను యథా తథంగా ఉంచారు, నిజానికి ఏపీ టిడ్కో భీమవరంలో 8,352 ఇళ్లు, తాడేపల్లిగూడెంలో 5,376, పాలకొల్లులో 6,784 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భీమవరం,పాలకొల్లు పట్టణాల్లో 1,888 ఇళ్లు మినహా మిగతా వాటిని దాదాపు పూర్తిచేసింది. రెండు పట్టణాల్లోనూ భీమవరం, నిర్మాణానికి నోచుకోని ఇళ్లకు పిలిచిన రివర్స్‌ టెండరింగ్‌లో ఒకే సంస్థ పనులు దక్కించు కుంది. పాలకొల్లులో నిర్మించాల్సిన ఇళ్లను తాజాగా రద్దు చేశా రు. అదే సంస్థ భీమవరంలో ఇళ్లను నిర్మిస్తుందని అధికారులు చెబుతున్నారు.


ఇలా రద్దు విషయంలోనూ ప్రభుత్వం వివక్ష  చూపుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దయిన ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. అర్బన్‌ హౌసింగ్‌ జాబితా నుంచి వారి పేర్లను తొలగించా లని ఆదేశించింది. జూలై 8న వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయనున్నారు.

Updated Date - 2020-07-02T10:57:34+05:30 IST