గోడ పేక మేడ ?!.. చేత్తో తోసేస్తే కూలిపోతున్న నిర్మాణ దశ గోడలు.. Viral Video

ABN , First Publish Date - 2022-06-24T23:08:24+05:30 IST

ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాసిరకం పనుల గురించి అప్పుడప్పుడూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. మరి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం పరాకాష్టకు చేరితే

గోడ పేక మేడ ?!.. చేత్తో తోసేస్తే కూలిపోతున్న నిర్మాణ దశ గోడలు.. Viral Video

లక్నో : ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాసిరకం పనుల గురించి అప్పుడప్పుడూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. మరి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం పరాకాష్టకు చేరితే ఎలా ఉంటుందో సాక్షాత్కరించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌(Uttarapradesh)లో వెలుగుచూసింది. నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల గోడలు ఉత్తచేతులతో తోసేస్తే ‘పేక మేడ’ల్లా పడిపోతున్నాయి. గోడలే కాదు.. ఇటుకలతో నిర్మించిన పిల్లర్లదీ ఇదే పరిస్థితి. ఒక్క చేత్తో నెట్టెస్తే కూలిపోతున్నాయి. విస్మయానికి గురిచేస్తున్న ఈ అనుభం సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) ఎమ్మెల్యే డా. ఆర్‌కే వర్మ‌(RK Verma)కు ఎదురైంది. ప్రతాప్‌గర్ జిల్లాలో రాణిగంజ్ ఏరియాలో కాలేజీ నిర్మాణ పనులను తనిఖీ చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేకి ఈ అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోలను సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. బీజేపీ(BJP) పాలనలో కొనసాగుతున్న అద్భుతమైన అవినీతి అత్యంత అరుదైనదిగా అఖిలేష్ యాదవ్ విమర్శించారు. సిమెంట్ లేకుండానే ఇటుకలు పేర్చారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. 


నిర్మాణ పనుల తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే ఆర్‌కే శర్మ స్పందిస్తూ.. ఇది నాలుగు అంతస్థుల భవనం కాబోతోందని అక్కడి బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హాస్టల్ భవనాలు కూడా ఇక్కడే నిర్మించబోతున్నారని అన్నారు. అదే సైట్‌లో నిర్మాణంలో వేరే బిల్డింగ్‌ల వద్దకు వెళ్లాను. కానీ ఫలితం మాత్రం సేమ్ టు సేమ్. గోడలు కూలిపోతున్నాయని వర్మ తెలిపారు. ఇలాంటి డొల్లతనం నిర్మాణాలు యువత భవిష్యత్‌ను నిర్మించలేవన్నారు. ఈ పనులు యువత చావుకు ఏర్పాట్లు చేస్తున్నట్టేనని బీజేపీ పాలనపై మండిపడ్డారు. రాణిగంజ్‌లో నిర్మిస్తున్న కాలేజీ నిర్మాణంలో అవినీతికి సంబంధించిన తాను షేర్ చేసిన వీడియోలు కొన్ని మాత్రమేనని ట్విటర్‌లో తెలిపారు.





Updated Date - 2022-06-24T23:08:24+05:30 IST