రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-01-27T04:47:24+05:30 IST

ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. టీడీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తూ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే స్వామి

ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి 

కొండపి, జనవరి 26 : ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని  ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. టీడీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తూ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మీడియా, న్యాయవ్యవస్థలు, ఈసీలాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై కూడా ఆరోపణలు చేయడం, వారికి దురుద్దేశాలు ఆపాదించడం జరుగుతోందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను భయపెట్టడం, రాజ్యాంగేతర పనులు చేయడం ఈ ప్రభుత్వంలో చూశామని, చూస్తున్నామని చెప్పారు. అందుకే రాజ్యాంగ పరిరక్షణ దినంగా రిపబ్లిక్‌డేను పాటిస్తున్నామన్నారు.  

అధిక స్థానాలు టీడీపీకే

నియోజకవర్గంలో మెజారీటీ గ్రామ పంచాయతీలు టీడీపీ గెలుచుకుంటుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు, అంతర్గత రోడ్డు నిర్మాణాలు, నిర్మించిన సైడు డ్రెయిన్లు, తాగునీటి సరఫరా కార్యక్రమాలు, ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు, అంతర్గత, బహిర్గత రోడ్లు నిర్మాణాలు అనేకం టీడీపీ అభ్యర్థుల విజయానికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య చౌదరి, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డపాటి యల్లమంద నాయుడు, యనమద్ని వెంకటేశ్వర్లు, నాయకులు రావిపాటి మధుసూదనరావు, బత్తుల నారాయణస్వామి, తిప్పారెడ్డి క్రిష్ణారెడ్డి, బూదవాటి సోమయ్య, నన్నూరి సుబ్బరామయ్య పాల్గొన్నారు. 

టంగుటూరులో...

పంచాయతీ ఎన్నికలకు టీడీపీ క్యాడర్‌ను సమాయత్తపరుస్తూ ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ముందుకెళ్తున్నారు. మండలంలోని గ్రామాల వారీగా మంగళవారం సమీక్షించారు. తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో ఎమ్మెల్యే, ముఖ్య నేతలైన మండల పార్టీ అధ్యక్షుడు కామని విజయకుమార్‌, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్‌, సీనియర్‌ నాయకుడు బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులతో మాట్లాడారు. గ్రామాల్లో టీడీపీ క్యాడర్‌తో సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని, ఆ సమావేశాలకు పార్టీ క్యాడర్‌తోపాటు సానుభూతిపరులు, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించేవారిని సమీకరించాలని సమావేశం సూచించింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇబ్బందులుంటే వెంటనే ఎమ్మెల్యే లేదా మండల పార్టీ నాయకుల దృష్టికి తేవాలని నిర్ణయించింది. టీడీపీ నాయకులంతా ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, అలాగే సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని సూచించింది.

Updated Date - 2021-01-27T04:47:24+05:30 IST