నేడు నియోజవర్గ స్థాయి క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2021-10-19T05:10:09+05:30 IST

స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలను మంగళవారం నిర్వహించనున్నట్లు ఆర్గనైజంగ్‌ కార్యదర్శి యాళ్ల పోలినాయుడు తెలిపారు.

నేడు నియోజవర్గ స్థాయి క్రీడా పోటీలు
క్రీడా మైదానాన్ని సిద్ధం చేస్తున్న పీఈటీలు

నరసన్నపేట: స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలను మంగళవారం నిర్వహించనున్నట్లు ఆర్గనైజంగ్‌ కార్యదర్శి యాళ్ల పోలినాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం కళాశాల మైదానంలో ఏర్పా ట్లను పరిశీలించారు. అఽథ్లెటిక్‌, ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పి.వెంకటరావు,పీఈటీలు గోపి, సింహాద్రి నాయుడు పాల్గొన్నారు. 



నేడు క్రీడాకారుల ఎంపిక

పాతపట్నం:  పెద్దసీది జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు గేమ్స్‌ కన్వీనర్‌ ఎన్ని శేఖర్‌బాబు తెలిపారు. సోమవారం క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అథ్లెటిక్స్‌,  వాలీబాల్‌, ఖోఖో క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 

 

Updated Date - 2021-10-19T05:10:09+05:30 IST