అర్ధరాత్రి రోడ్డుపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తాను పోలీసునంటూ యువతిపై సెల్ లైట్ వేసి.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-23T03:30:57+05:30 IST

మద్యం మత్తులో కొందరిలో సైకో బయటికి వస్తుంటాడు. ఆ సమయంలో కన్నీమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. చివరకు జైలు పాలవుతుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన ఓ పోలీసు..

అర్ధరాత్రి రోడ్డుపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తాను పోలీసునంటూ యువతిపై సెల్ లైట్ వేసి.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

మద్యం మత్తులో కొందరిలో సైకో బయటికి వస్తుంటాడు. ఆ సమయంలో కన్నీమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. చివరకు జైలు పాలవుతుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన ఓ పోలీసు.. తన వృత్తికే కలంకం తెచ్చాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా సెల్ లైట్ వేసి మరీ తన సైకోయిజాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే..


కర్ణాటకకు చెందిన చంద్రశేఖర్(40) అనే వ్యక్తి పోలీసుగా విధులు నిర్వర్తిస్తుంటాడు. యలహంక న్యూ టౌన్ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఓ రోజు స్నేహితుడు పుట్టినరోజుకు హాజరయ్యాడు. అక్కడ ఫుల్‌గా మద్యం సేవించాడు. అనంతరం అర్ధరాత్రి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో యలహంక ప్రాంతంలో ఓ 26 ఏళ్ల యువతి అర్ధరాత్రి వీధికుక్కలకు ఆహరం వేయడానికి బయటకు వచ్చింది. యువతిని చూసిన కానిస్టేబుల్.. ఆమెపై సెల్ లైట్ వేసి, అసభ్యంగా ప్రవర్తించాడు.

65ఏళ్ల వృద్ధుడితో వివాహేతర సంబంధం.. ఉన్నట్టుండి మహిళ అదృశ్యం.. చివరగా వృద్ధుడు చెప్పిన కారణాలు విని..


తాను పోలీసునంటూ బెదిరించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. సమీపంలోని ఓ బాటసారి దీన్నంతా వీడియో తీశాడు. దీంతో ఆ కానిస్టేబుల్ కాళ్లబేరానికి వచ్చాడు. ఆ వీడియో తొలగించాలని, లేదంటే ఉద్యోగం పోతుందని ప్రాథేయపడ్డాడు. మరుసటి రోజు ఆ బాటసారి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. డీసీపీ (ఈశాన్య) సీకే బాబా వరకు ఈ వీడియో చేరడంతో చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు.

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..

Updated Date - 2021-12-23T03:30:57+05:30 IST