కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేటలో నాగబాబు అనే కానిస్టేబుల్.. మంగళవారం బలన్మరణానికి పాల్పడ్డాడు. గడ్డి మందు తాగిన కానిస్టేబుల్‌ను.. స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పెనగంచిప్రోలుకు చెందిన కానిస్టేబుల్ మృతిపై.. కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.