రంగారెడ్డి: పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారంతో మహేశ్వరం పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్సై తరపున రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి కానిస్టేబుల్ యాదయ్య చిక్కాడు. రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకుని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.