రూ. 40 వేలు లాగేసిన హోంగార్డు, కానిస్టేబుల్‌

ABN , First Publish Date - 2020-11-23T15:16:22+05:30 IST

వెళ్లిన పని.. వారంట్‌ సర్వ్‌ చేయడం. చేసిన పని.. నిందితుడిని బెదిరించి డబ్బులు లాగేయడం. ఇదీ.. ఒక హోంగార్డు, కానిస్టేబుల్‌ చేసిన నిర్వాకం. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద ఒక వ్యక్తిపై కోర్టు వారంట్‌ పెండింగ్‌లో ఉంది. దానిని ఇవ్వడానికి నార్త్‌జోన్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు

రూ. 40 వేలు లాగేసిన హోంగార్డు, కానిస్టేబుల్‌

హైదరాబాద్‌ : వెళ్లిన పని.. వారంట్‌ సర్వ్‌ చేయడం. చేసిన పని.. నిందితుడిని బెదిరించి డబ్బులు లాగేయడం. ఇదీ.. ఒక హోంగార్డు, కానిస్టేబుల్‌ చేసిన నిర్వాకం. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద ఒక వ్యక్తిపై కోర్టు వారంట్‌ పెండింగ్‌లో ఉంది. దానిని ఇవ్వడానికి నార్త్‌జోన్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సిబ్బంది పది రోజుల క్రితం నిందితుడి ఇంటికి వెళ్లారు. వారంట్‌ను చూపి బెదిరించారు. బెంబేలెత్తిన నిందితుడు.. వారికి రూ. 40 వేలు ఇచ్చాడు. తర్వాత తన న్యాయవాది వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. కోర్టులో పిటిషన్‌ వేస్తే సరిపోయేదని.. డబ్బులు ఎందుకు ఇచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. దాంతో ఫిర్యాదు చేద్దామని పోలీసు స్టేషన్‌కు బాధితుడు వెళ్లగా.. అక్కడి సిబ్బంది మాట్లాడి పంపేశారు. విషయం అప్పటి ఏసీపీ వరకూ వెళ్లడంతో.. ఆయన నివేదికతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సదరు హోంగార్డు, కానిస్టేబుల్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. దీనితో సంబంధం ఉన్న మరో హోంగార్డునూ అటాచ్‌ చేశారు. కానీ. తర్వాత ఏం జరిగిందో ఏమో!. అటాచ్‌ అయిన హోంగార్డుకు తిరిగి అదే నార్త్‌జోన్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో రెండుమూడు రోజుల్లోనే పోస్టింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2020-11-23T15:16:22+05:30 IST