మార్కెట్ల మూసివేతకు కుట్ర: సంఘాలు

ABN , First Publish Date - 2020-09-29T08:11:16+05:30 IST

మార్కెట్ల మూసివేతకు కుట్ర: సంఘాలు

మార్కెట్ల మూసివేతకు కుట్ర: సంఘాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లను మూసివేసి లక్షలాది ఎకరాల మార్కెట్‌ యార్డు భూములను పక్కదారి పట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ యార్డ్స్‌ హమాలీ, దడువాయి, చాటా, స్వీపర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ధ్వజమెత్తింది. సోమవారం ఏఐటీయూసీ కార్యాలయం వద్ద యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా హమాలీ, దడువాయి, చాటా, స్వీపర్‌లు పని చేస్తున్నారని వీరికి 40 ఏళ్లుగా ప్రతియేటా అందించే యూనిఫారంను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడంతో కుట్ర బట్టబయలైందన్నారు. 

Updated Date - 2020-09-29T08:11:16+05:30 IST