అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు

ABN , First Publish Date - 2022-08-15T05:28:03+05:30 IST

ఇన్నాళ్లు అధికారం అనుభవించి తమ ఆస్తు లను పెంచుకున్న ఒకరిద్దరు నాయకులు ఇప్పుడు కుర్చీకోసం గుంతకాడి నక్క ల్లా కాచుక్కూర్చున్నారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించా రు.

అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు
కళాకారులకు ప్రశంసా పత్రాలు ఇస్తున్న మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్‌

- కుర్చీ కోసం గుంటనక్కల్లా కాచుక్కూర్చున్నారు

- మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ ఫ టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 14 : ఇన్నాళ్లు అధికారం అనుభవించి తమ ఆస్తు లను పెంచుకున్న ఒకరిద్దరు నాయకులు ఇప్పుడు కుర్చీకోసం గుంతకాడి నక్క ల్లా కాచుక్కూర్చున్నారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించా రు. అధికారంలో ఉన్నన్నాళ్లు ఇక్కడి వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, ఇప్పు డు అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని దుయ్యబ ట్టారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో 37వ వార్డుకు చెందిన కాంగ్రె స్‌, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున చేరగా మంత్రి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వజ్రోత్సవ వేడుకల్లో డమ్మీ బుల్లెట్‌ గాల్లో కాలిస్తే అనవసరమైన వివాదంగా మార్చేందుకు ప్రతిపక్ష నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని బలీయమైన శక్తిగా మార్చేందుకు అందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, శివరాజు, వినోద్‌, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

కళలను కాపాడుకుంటాం

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బా ధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌, క్రీడ లు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పే ర్కొన్నారు. రాష్ట్రంలోని కళలు, కళాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. జిల్లా పరిషత్‌ మైదానంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జానపద కళా కారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ లోని చేనేత కార్మికులు తయారు చేసిన జాతీయ జెండాలను వజ్రోత్సవాల సందర్భంగా మన రాష్ట్రంతో పాటు 22 రాష్ట్రాలకు అందించడం ఎంతో సంతోషిం చదగ్గ విషయమన్నారు. విద్యార్థులు, యువత, ప్రజలు జాతీయ భావనను పెంపొందించుకోవాలని మంత్రి కోరారు. తెలంగాణలోని సినిమా హాళ్లలో ఉచితంగా ప్రదర్శించిన గాంధీ సినిమా తమ రాష్ట్రాలలోను ప్రదర్శించాలని ఇత ర రాష్ట్రాల వారు అడుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సాంస్కృతిక ప్రదర్శ నలు చేసిన కళాకారులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందించారు. జడ్పీ చైర్‌ పర్సన స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, అడిషనల్‌ కలెక్టర్లు తేజస్‌నందలాల్‌ పవర్‌, సీతారామారావు, సాంస్కృతిక శాఖ అధికారి వెంకటేశ్వ ర్లు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు

పాలమూరు : రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌర వ భవనాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆబ్కారిశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వెంకటేశ్వరకాలనీ (లక్ష్మీనగర్‌)లో ఏర్పాటు చేసిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేసే కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కే.సి నరసింహులు, గౌడ సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, సత్యనారాయణ, గంగాధర్‌, రాజయ్య హాజరయ్యారు.

Updated Date - 2022-08-15T05:28:03+05:30 IST