నాడు- నేడు పనులు నాణ్యతగా చేయండి

ABN , First Publish Date - 2020-07-04T10:06:46+05:30 IST

నాడు - నేడు పనులను నాణ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం రూరల్‌ మండలం పరిధిలోని

నాడు- నేడు పనులు  నాణ్యతగా చేయండి

జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు

కక్కలపల్లి కాలనీ మండల పరిషత్‌ పాఠశాల సందర్శన

కొడిమి, ఉప్పరపల్లి గ్రామాల్లో ఇంటి స్థలాల లేఅవుట్లు పరిశీలన


అనంతపురంరూరల్‌, జూలై 3 : నాడు - నేడు పనులను నాణ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం రూరల్‌ మండలం పరిధిలోని కక్కలపల్లి కాలనీలోని మండల పరిషత్‌ పాఠశాలను డీఈఓ శామ్యూల్‌తో క లిసి సందర్శించారు.  జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎంత ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారని అధికారులతో ఆరా తీశారు. అనంతరం కూలీలతో మాట్లాడారు. ఒక్కొక్కరికి ఎంత కూలీ ఇస్తున్నారు.


మహిళలకు ఎంత కూలీ ఇస్తున్నారని కూలీలనే అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లోపు పనులు పూర్తి కావాలని సూచించారు. ఇదే క్రమంలో కూలీల సంఖ్య పెంచి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి కొడి మి, ఉప్పరపల్లి గ్రా మాల్లో జరుగుతున్న నవశకం ఇంటి స్థలాల లేఅవుట్లను పరిశీలించారు. ఈనెల 8న పేదలకు ఇంటి పట్టాల పంపి ణీ ఉన్నందున్న లేఅవుట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. స్థానికంగా ఎంత మందికి ఇళ్లస్థలాలు కేటాయించారు. తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.


లేఅవుట్లలో ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని  అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గుణభూషన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఈశ్వరయ్యశెట్టి, నగర కమిషనర్‌ మూర్తి, మండల సర్వేయర్‌ ప్రతాప్‌రెడ్డి, ఈఈ శివకుమార్‌, ఎంఈఓ వెంకటస్వామి, ఇంజనీర్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసింహులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T10:06:46+05:30 IST