నకిలీ పోలీసుల హల్‌చల్.. ఇంటిపై దాడి చేసి రూ. 5 లక్షలు డిమాండ్.. చివరకు..

ABN , First Publish Date - 2022-03-06T05:36:19+05:30 IST

ఉజ్జయినిలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. ఓ యువతి ఆధ్వర్యంలో ముగ్గురు వ్యక్తులు పోలీసుల వేషంలో ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని ఆరోపించి నగలు, డబ్బులు లాక్కున్నారు. తమకు వెంటనే రూ.5 లక్షలు...

నకిలీ పోలీసుల హల్‌చల్.. ఇంటిపై దాడి చేసి రూ. 5 లక్షలు డిమాండ్.. చివరకు..

ఉజ్జయినిలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. ఓ యువతి ఆధ్వర్యంలో ముగ్గురు వ్యక్తులు పోలీసుల వేషంలో ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని ఆరోపించి నగలు, డబ్బులు లాక్కున్నారు. తమకు వెంటనే రూ.5 లక్షలు ఇవ్వకపోతే అందరినీ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. చివరకు అక్కడున్న వస్తువులు తీసుకుని వెళ్లిపోయారు. వారంతా నకిలీ పోలీసులు అని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


గత నెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సుదామనగర్‌‌లోని ఓ ఇంటికి నలుగురు వ్యక్తులు వచ్చారు. తలుపు తెరవగానే నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ ఉన్న యువతీయువకులు బయటకు పారిపోవడం ప్రారంభించారు. తాము పోలీసులమని అందర్నీ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే అందరి మీద కేసులు పెడతామన్నారు. వారు డబ్బులు లేవని చెప్పడంతో అక్కడున్న ఓ స్త్రీ మెడలో మంగళసూత్రం, ఇంట్లోని డబ్బులు లాక్కుని వెళ్లిపోయారు. 


చివరకు వారు నకిలీ పోలీసులని తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఆ ఇంట్లో నిజంగానే వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-03-06T05:36:19+05:30 IST