చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ పర్యటనతో భారత్‌కు ముప్పు: యూఎస్ చట్టసభ సభ్యుడు!

ABN , First Publish Date - 2021-07-28T16:38:30+05:30 IST

గతవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టిన...

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ పర్యటనతో భారత్‌కు ముప్పు: యూఎస్ చట్టసభ సభ్యుడు!

వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్  గతవారం చేపట్టిన టిబెట్ పర్యటన భారత్‌కు ముప్పుగా పరిణమించనున్నదని యూఎస్ చట్టసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్ మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ను ఆనుకునివున్న టిబెట్ ప్రాంతానికి చెందిన న్యింగ్చీ పట్టణంలో పర్యటించారు. ఆయన అక్కడి సైనికాధికారులను కలుసుకున్నారు. టిబెట్ అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించారు. 


దీని గురించి యూఎస్ చట్టసభ సభ్యుడు డేవిడ్ నెనెస్ ‘ఫాక్స్ న్యూస్’ తో మాట్లాడుతూ చైనా నియంత జీ జిన్ పింగ్ ఇటీవల భారత సరిహద్దుల్లోని టిబెట్ ప్రాంతంలో పర్యటన జరిపి, దానిని తన విజయంగా చాటుకున్నారన్నారు. గడచిన 30 ఏళ్లలో జీ జిన్ పింగ్ టిబెట్‌లో పర్యటించడం ఇదే తొలిసారని అన్నారు. ఒక బిలియన్‌కు మించి జనాభాతో పాటు అణ్వాయుధాలు కలిగివున్న భారతదేశానికి ఇది ప్రమాదకర మన్నారు. భారతదేశంలో జల వనరులకు విఘాతం కలిగించే ఒక పెద్ద వాటర్ ప్రాజెక్టును చైనా అభివృద్ధి చేయబోతున్నదని, ఫలితంగా భారత్‌కు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-07-28T16:38:30+05:30 IST