ఈవీఎంలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

ABN , First Publish Date - 2022-03-10T18:27:19+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు....

ఈవీఎంలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట కార్యకర్తలు ఈవీఎంలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఈవీఎంలలో అవకతవకలు జరిగినందునే కాంగ్రెస్ ఘోర ఓటమి చెందిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఎన్నికల సంఘం తాజా ఫలితాల ప్రకారం మొత్తం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.‘‘పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేం ఊహించాం, కానీ మాకు అవసరమైన బలం రాలేదు.దీని గురించి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూలు వరుసగా చమ్‌కూర్ సాహిబ్ మరియు అమృత్‌సర్ తూర్పు స్థానాల నుంచి వెనుకంజలో ఉన్నారు. 


Updated Date - 2022-03-10T18:27:19+05:30 IST