Abn logo
Sep 22 2021 @ 19:49PM

PUNJAB : సిద్దూని నమ్ముకుంటే కాంగ్రెస్‌కు 10 సీట్లు కూడా రావు

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూపై మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆగ్రహం కొనసాగుతూనే ఉంది. ఆయన తన తాజా ఇంటర్వ్యూలో అటు నవజ్యోత్ సింగ్ సిద్దూను, ఇటు రాహుల్, ప్రియాంకను కూడా టార్గెట్ చేశారు. అయితే, గాంధీ వారసుల్ని కెప్టెన్ నేరుగా విమర్శించలేదు. వారికి తగినంత అనుభవం లేదంటూనే... వాళ్లకు సలహాలు ఇస్తోన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని కామెంట్ చేశారు. పీపీసీసీ చీఫ్ సిద్దూని మాత్రం సింగ్ సీరియస్‌గా తిట్టిపోశారు.



సిద్దూని రానున్న కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రచారంలోకి తీసుకొస్తే తాను అన్ని విధాలా అడ్డుకుంటానని పంజాబ్ ఎక్స్ సీఎం స్పష్టం చేశారు. 2022 ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్‌ను ఓడించటానికి తన తరుఫున బలమైన అభ్యర్థిని కూడా బరిలోకి దింపుతానని ప్రకటించారు. అంతే కాదు, అతడ్ని నమ్ముకుని ఎన్నికలకు పోతే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పది సీట్లు కూడా రావని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘సిద్దూ పంజాబ్‌కు ప్రమాదం’’ అంటూ తీవ్రమైన హెచ్చరిక కూడా అమరీందర్ చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption