ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం

ABN , First Publish Date - 2022-08-17T06:25:48+05:30 IST

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని పీసీసీ ప్రచారకమిటీ చై ర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అన్నారు.

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం
సమావేశంలో మాట్లాడుతున్న మధుయాష్కీగౌడ్‌

పీసీసీ ప్రచారకమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ 

మర్రిగూడ, ఆగస్టు 16: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని పీసీసీ ప్రచారకమిటీ చై ర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అన్నారు. మర్రిగూడ, నాంపల్లి కాంగ్రెస్‌ కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మల్లు రవి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. మునుగోడులో కాంగ్రె స్‌ పటిష్ఠంగా ఉందని, రాజగోపాల్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీలో చేరారన్నారు. ఆయన వెంట కార్యకర్తలు ఎవ్వరూ బీజేపీలో చేరలేదని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ఉప ఎన్నికలో సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలన్నారు. ఈనెల 20న రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా ప్రతీ ఒక్కరు జాతీయజెండాను ఎగురవేయాలని సూచించారు. సమావేశంలో నాంపల్లి, మర్రిగూడ మండలాల బాధ్యులు అంజన్‌కుమార్‌యాదవ్‌, చెరుకు సుధాకర్‌, నరేందర్‌రెడ్డి, స్రవంతీరెడ్డి, పల్లె రవికుమార్‌, పున్న కైలా్‌షనేత, చల్లమల్ల కృష్ణారెడ్డి, విజయరామారావు, అనిల్‌రెడ్డి, కుంభం శ్రీనివాసరెడ్డి, తిరుపతయ్య, హనుమంతు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


స్వలాభం కోసమే రాజీనామా

మునుగోడు: రాజగోపాల్‌రెడ్డి స్వలాభం కోసమే రాజీనామా చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మునుగోడులో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకులు నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, పాల్వాయి చెన్నారెడ్డి, పోలగోని సైదులుగౌడ్‌, పందుల భాస్కర్‌, పాల్గొన్నారు. 


ప్రజలను ముంచిన రాజగోపాల్‌

 నమ్మి గెలిచింపిన ప్రజలను నట్టేట ముంచి, రూ.21వేల కోట్ల కాంట్రాక్టుల కోసం రాజగోపాల్‌రెడ్డి బీజేపీ చేరారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. మండలంలోని జమస్థాన్‌పల్లి క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడుకు మంచి రోజులు రానున్నాయన్నారు. సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నారాయణ, బండా పురుషోత్తంరెడ్డి, జాజుల అంజయ్య, లాల్‌బహదూర్‌ పాల్గొన్నారు.


మంత్రి జగదీ్‌షరెడ్డి సమక్షంలో చేరిక

నల్లగొండ: మంత్రి జగదీ్‌షరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కు చెందిన నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం ఎంపీటీసీ సప్పిడి రాధిక శ్రీనివా్‌సరెడ్డితోపాటు దేవత్‌పల్లి ఎంపీటీసీ మంగళవారం సాయంత్రం టీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ ఎనిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T06:25:48+05:30 IST