మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ధుంధుభి

ABN , First Publish Date - 2021-12-31T01:12:39+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 498 వార్డుల్ని గెలుచుకుంది. అధికార బీజేపీ కేవలం 437 వార్డుల్లో మాత్రమే గెలిచింది. ఇక కర్ణాటక స్థానిక పార్టీ జనతాదళ్ సెక్యూలర్ పార్టీ 45 స్థానాలు గెలుచుకోగా ఇతర పార్టీలు 204 స్థానాలు గెలుచుకున్నాయి..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ధుంధుభి

బెంగళూరు: కర్ణాటకలోని మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. 58 మున్సిపాలిటీల పరిధిలోని 1184 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 42.06 శాతం ఓట్లతో అతి ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని మొదటి స్థానంలో నిలిచింది. అధికార పార్టీ బీజేపీ కాంగ్రెస్ కంటే వెనుకబడి పోయింది. ఐదు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 167 వార్డులు, 19 పట్టణ మున్సిపల్ కైన్సిల్ల పరిధిలో 441వార్డులు, 34 పట్టణ పంచాయతీల పరిధిలో 577 వార్డులు కలుపుకుని మొత్తంగా 1184 వార్డులకు డిసెంబర్ 27న జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి.


కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 498 వార్డుల్ని గెలుచుకుంది. అధికార బీజేపీ కేవలం 437 వార్డుల్లో మాత్రమే గెలిచింది. ఇక కర్ణాటక స్థానిక పార్టీ జనతాదళ్ సెక్యూలర్ పార్టీ 45 స్థానాలు గెలుచుకోగా ఇతర పార్టీలు 204 స్థానాలు గెలుచుకున్నాయి. ఓట్ల శాతంలో బీజేపీని కాంగ్రెస్ బాగా వెనక్కి నెట్టింది. బీజేపీ 36.90 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్ పార్టీ 42.06 శాతం ఓట్లు సాధించింది. అయితే నగర మున్సిపాలిటీల్లో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. నగర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 61 వార్డులు గెలుచుకోగా బీజేపీ 67 వార్డుల్లో విజయం సాధించింది. ఇక ఇతర అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ విజయ విహారం కొనసాగించింది.

Updated Date - 2021-12-31T01:12:39+05:30 IST