ప్రజల్ని హిందూ-ముస్లింలుగా కాంగ్రెస్ విడగొడుతోంది: అమిత్ షా

ABN , First Publish Date - 2021-03-31T20:43:25+05:30 IST

మేం ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాం. ముస్లిం ఇళ్లకు కూడా తాగు నీరు వచ్చాయి. అంతే కాదు, ఇళ్లు కట్టుకోవాడానికి మైనారిటీలకు కూడా సహాయం చేశాము. రైతులకు అందించిన 10 వేల రూపాయల

ప్రజల్ని హిందూ-ముస్లింలుగా కాంగ్రెస్ విడగొడుతోంది: అమిత్ షా

గువహాటి: అస్సాం ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ విడదీసి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం అస్సాంలోని కుమ్రప్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి లక్ష్యంతో, ఉమ్మడి ప్రయోజనాలతో తాము ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చీలిక రాజకీయాలు చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు.


‘‘బోడో-నాన్ బోడో, అస్సామీ-బెంగాలీ, హిందూ-ముస్లిం, ఎగువ అస్సాం-దిగువ అస్సాం, గిరిజన-గిరిజనేత.. ఇలా అస్సాం ప్రజల్ని విడదీస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ (అందరికీ అభివృద్ధి, అందరి నమ్మకం) అనే నినాదంతో ప్రజల్ని ఏకం చేస్తున్నారు. మేం ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాం. ముస్లిం ఇళ్లకు కూడా తాగు నీరు వచ్చాయి. అంతే కాదు, ఇళ్లు కట్టుకోవాడానికి మైనారిటీలకు కూడా సహాయం చేశాము. రైతులకు అందించిన 10 వేల రూపాయల ఆర్థిక సాయం మైనారిటీ, గిరిజన, బోడోలకు కూడా అందాయి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Updated Date - 2021-03-31T20:43:25+05:30 IST