నర్సుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు

ABN , First Publish Date - 2021-07-31T01:41:57+05:30 IST

రాష్ట్రంలో నర్సులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నాయకురాలు

నర్సుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు

హైదరాబాద్: రాష్ట్రంలో నర్సులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నాయకురాలు గీతారెడ్డి తెలిపారు. ఎంపీగా తన బిడ్డ కవిత ఓడిపోతే భరించలేక వెంటనే కవితను కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారని ఆమె పేర్కొన్నారు. మరి నర్సింగ్ బిడ్డలను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా కోవిడ్ రోగులకు సేవలు చేసింది ఈ నర్సులేనని ఆమె అన్నారు. కరోనా సమయంలో సేవలు చేయించుకుని అనంతరం వాళ్లని రోడ్డు మీదకు పడేస్తావా అని ప్రభుత్వాన్ని గీతారెడ్డి నిలదీశారు. 

Updated Date - 2021-07-31T01:41:57+05:30 IST