కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలి

ABN , First Publish Date - 2022-08-11T06:05:39+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలి
పెగడపల్లి మండలంలో కాంగ్రెస్‌ నాయకుల పాదయాత్ర

-   జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్‌ 

పెగడపల్లి, ఆగస్టు 10 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని దోమలకుంట, ఆరవెల్లి, మద్దులపల్లి క్రాస్‌ రోడ్డు నుండి పెగడపల్లి వరకు ఆ పార్టీ నాయకులతో కలసి లక్ష్మణ్‌కుమార్‌ బుధవారం ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దారి పొడుగునా రైతులు, రైతు కూలీలు, కార్మికులను, మహిళలను పల కరిస్తూ వారు ఎదర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెగ డపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములుగౌడ్‌, నాయకులు గజ్జెల స్వామి, తాటిపర్తి శోభారాణి, ఈరెల్లి శంకర్‌, ఒరుగల శ్రీనివాస్‌, పూసాల శోభాతిరుపతి, సింగసాని విజయలక్ష్మి స్వామి, బండారి శ్రీనివాస్‌, మల్లారెడ్డి, సుదీర్‌, కడారి తిరుపతి, చాట్ల భాస్కర్‌, బలరాంరెడ్డి, కిషన్‌, మల్లేశంపాల్గొన్నారు.

 ఇబ్రహీంపట్నంలో... 

ఇబ్రహీంపట్నం : మండలంలోని వర్షకొండ గ్రామంలో బుధవారం  టీపీసీసీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అజాదీకా గౌరవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు ఆజాదీకా గౌరవయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు వాకిటి సత్యంరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు అల్లూరి మహేం దర్‌రెడ్డి, వెంకటస్వామి, నర్సక్క, హఫిజ్‌, నసీర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T06:05:39+05:30 IST