Advertisement
Advertisement
Abn logo
Advertisement

7న జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ దీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ముఖ్యనేతలతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ మానిక్కం ఠాగూర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. ఈ నెల 7న గాంధీ భవన్, జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేయాలని కాంగ్రెస్‌ నాయకులు నిర్ణయించారు. గవర్నర్‌ను శుక్రవారం కాంగ్రెస్ నాయకుల బృందం కలవాలని నిర్ణయించారు. దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసైకి కాంగ్రెస్‌ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు. అలాగే జిల్లాల్లో కలెక్టర్లను కలిసి డీసీసీ ప్రతినిధులు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.  


Advertisement
Advertisement