కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2021-05-13T06:15:08+05:30 IST

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి విమర్శించారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం
కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్న ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి తదితరులు

కొవ్వొత్తులు వెలిగించి కాంగ్రెస్‌ నేతల నిరసన

గుంటూరు, మే 12: కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి విమర్శించారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై బుధవారం సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలిపారు. పొన్నూరు రోడ్డులోని తన నివాసంలో ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, కృష్ణనగర్‌లో నివాసంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావుతో పాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. మస్తాన్‌వలి మాట్లాడుతూ వైరస్‌ బారిన పడి  ఆక్సిజన్‌ లేక, మెరుగైన వైద్యం అందక, సరిపడా బెడ్లు చాలక ఎంతోమంది మృతి చెందుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయే తప్ప తక్షణ అవసరాలను తీర్చటం లేదని విమర్శించారు. కరోనాతో పేద , మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షేక్‌ కరీమ్‌, బన్నీ, జానీ, కలీం, బాబు, ఇస్మాయిల్‌, శివ, సలామ్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-05-13T06:15:08+05:30 IST