కాంగ్రెస్‌ పార్టీది త్యాగాల చరిత్ర

ABN , First Publish Date - 2022-08-11T05:33:11+05:30 IST

దేశ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌ పార్టీ త్యాగాల చరిత్ర కలిగి ఉందని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీది త్యాగాల చరిత్ర
పాదయాత్ర చేస్తున్న శ్రీధర్‌బాబు

ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథనిరూరల్‌, ఆగస్టు 10: దేశ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌ పార్టీ త్యాగాల చరిత్ర కలిగి ఉందని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. 75వ స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదికా గౌరవ్‌ యాత్రలో భాగంగా బుధవారం మండలంలోని గుంజపడుగు, ఉప్పట్ల గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుల అధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన అనేక మంది త్యాగధనులను స్మరించుకుంటూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆజాదికా గౌరవ్‌ యాత్రను చేపడుతున్నామన్నారు. దేశానికి దశాదిశను చూపిస్తూ అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదన్నారు. ఈయాత్రలో భాగంగా మహానీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో 75 కిలో మీటర్ల పాదయాత్రను చేపడుతున్నామన్నారు. యువత స్వాతంత్య్ర సమరమోధుల స్ఫూర్తిని వారి త్యాగాన్ని ముందుకు తీసుకెళ్లి దేశ గొప్పతనాన్ని చాటాలన్నారు. గాంధీ, నెహ్రూ విగ్రహాల వద్ద ఆయన నివాళులర్పించారు. గుంజపడుగు మండల కేంద్రం కోసం గ్రామస్థులు చేస్తున్న దీక్షకు శ్రీధర్‌బాబు సంఘీభావం తెలిపారు. తాను 2018లోనే ఇదే డిమాండ్‌పై సీఎంకు లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం అన్ని వనరులు, ప్రభుత్వ భూమలు ఉన్న గుంజపడుగును ప్రజల ఆకాంక్ష మేరకు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సెగ్గెం రాజేష్‌, పెండ్రి రమాదేవీ-సురేష్‌రెడ్డి, గోటికార్‌ కిషన్‌జీ,  రావికంటి సతీష్‌, మూల సరోజన, జంజర్ల శేఖర్‌, అజీం, ఎరుకల ప్రవీణ్‌, ఊదరి ఓదెలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T05:33:11+05:30 IST