పార్టీలో సమూల ప్రక్షాళన జరగాలి

ABN , First Publish Date - 2021-06-14T07:54:23+05:30 IST

కాంగ్రె్‌సలో సంస్థాగతంగా సమూల ప్రక్షాళన జరిగి తీరాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబ్బల్‌ ఆదివారం పునరుద్ఘాటించారు...

పార్టీలో సమూల ప్రక్షాళన జరగాలి

  • కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబ్బల్‌ పునరుద్ఘాటన
  • బీజేపీకి గట్టి ప్రత్యామ్నాయం లేదని వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 13 : కాంగ్రె్‌సలో సంస్థాగతంగా సమూల ప్రక్షాళన జరిగి తీరాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబ్బల్‌ ఆదివారం పునరుద్ఘాటించారు. పార్టీలో స్తబ్ధత ఇంకెంత మాత్రం వాంఛనీయం కాదన్నారు. దేశం ఇప్పుడు పునరుత్తేజిత కాంగ్రెస్‌ కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. పార్టీలో సమూల ప్రక్షాళన కోరుతూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గత ఏడాది లేఖ రాసిన 23 మంది సీనియర్లలో ఆయన కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీకి గట్టి ప్రత్యామ్నాయం లేదని సిబ్బల్‌ స్పష్టం చేశారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో అసమర్థత కారణంగా.. పరిపాలించే నైతికతను ప్రధాని మోదీ కోల్పోయారని చెప్పారు. బెంగాల్‌, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిదేనని సిబ్బల్‌ చెప్పారు.


Updated Date - 2021-06-14T07:54:23+05:30 IST