కాంగ్రెస్‌కు బలమైన అధినేత కావాలి: శివసేన

ABN , First Publish Date - 2021-10-03T01:11:01+05:30 IST

ఏ రాజకీయ పార్టీకైనా బలమైన నాయకత్వం అవసరం. కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీకి దానికి అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదంటే పార్టీలో అసంతృప్తులు అనేకం పెరుగుతూ ఉంటాయి. రాజకీయ పార్టీకి అధినేత లేకపోతే ప్రజల్లో విశ్వాసం పొందడం కూడా కష్టమే. అది ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది..

కాంగ్రెస్‌కు బలమైన అధినేత కావాలి: శివసేన

ముంబై: కాంగ్రెస్ పార్టీకి బలమైన అధినేత కావాలని శివసేన అధినేత సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. నాయకత్వం లేని పార్టీ పట్ల ప్రజల్లో అయోమయం ఉంటుందని, పార్టీలో కూడా అసంతృప్తులు పెరుగుతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తుందని సంజయ్ రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు.


శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఏ రాజకీయ పార్టీకైనా బలమైన నాయకత్వం అవసరం. కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీకి దానికి అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదంటే పార్టీలో అసంతృప్తులు అనేకం పెరుగుతూ ఉంటాయి. రాజకీయ పార్టీకి అధినేత లేకపోతే ప్రజల్లో విశ్వాసం పొందడం కూడా కష్టమే. అది ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. కానీ నాకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంది. త్వరలోనే ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ పరిష్కరించుకుంటుంది’’ అని అన్నారు.


మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అగాడీ పేరుతో ప్రభుత్వాని ఏర్పాటు చేసిన శివసేన.. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను అమిత్ షా కలుసుకోవడంపై శివసేన అధికారిక పత్రిక సామ్నా, శుక్రవారం నాటి ఎడిషన్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. సరిహద్దు సమస్య గురించి చర్చించాలంటే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్‌ను కలవాలి కానీ కెప్టెన్ అమరీందర్‌ను కలుసుకోవడం ఏంటని అమిత్ షాపై సామ్నా మండిపడింది.

Updated Date - 2021-10-03T01:11:01+05:30 IST