గుజరాత్‌లో రిసార్టు రాజకీయాలకు ఆజ్యం పోసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-06-06T17:47:13+05:30 IST

ఒకే రోజు ఇద్దరి ఎమ్మెల్యేల ఝలక్.... 24 గంటలు తిరక్కుండానే మరో ఎమ్మెల్యేల ఝలక్... ఇదీ....

గుజరాత్‌లో రిసార్టు రాజకీయాలకు ఆజ్యం పోసిన కాంగ్రెస్

అహ్మదాబాద్: ఒకే రోజు ఇద్దరి ఎమ్మెల్యేల ఝలక్.... 24 గంటలు తిరక్కుండానే మరో ఎమ్మెల్యేల ఝలక్... ఇదీ.... గుజరాత్ కాంగ్రెస్‌లో ఏర్పడిన రాజకీయ తుపాన్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. శనివారం ఉదయం నుంచే... రిసార్టు రాజకీయాలకు తెరలేపింది.


కరోనా వేళ... ఎమ్మెల్యేలందర్నీ రిసార్టులకు తరలిస్తున్నారు. 65 మంది ఎమ్మెల్యేలను అధిష్ఠానం గుజరాత్‌లోని రిసార్టులకు తరలించేసి... ఎవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  సందర్భం కాని వేళలో రాజీనామా చేస్తే అధిష్ఠానం అంతగా పట్టించుకునేది కాదు. కానీ... రాజ్యసభ ఎన్నికల వేళ. ఒక్కరైనా... స్వతంత్రుడైనా... పార్టీలన్నీ ఆప్యాయంగా చూసుకుంటాయి. వీరిని ఆప్యాయంగా చూసుకోకపోతే.. రాజ్యసభలో సీటు మిస్సవుతుంది. దీంతో అందర్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.


అయితే... రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే... కాంగ్రెస్ ఆదమరిచి ఉన్న సమయంలో రాజకీయ ప్రత్యర్థి దెబ్బకొట్టేసింది. కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రెండ్రోజలు క్రితం అక్షయ్ పటేల్, జితు చౌదరి రాజీనామా చేయగా, మరుసటి రోజు బ్రిజేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

Updated Date - 2020-06-06T17:47:13+05:30 IST