కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలి: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-17T02:50:31+05:30 IST

మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని సీఎం కేసీఆర్‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు.

కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలి: జీవన్‌రెడ్డి

జగిత్యాల: మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని సీఎం కేసీఆర్‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రిగా ఉన్నప్పుడు ప్రసంగాలే కాదు పథకాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తన నిర్లక్ష్యం వీడాలని చెప్పారు. సీఎం కేసీఆర్ దళితుల నిధులను దారి మళ్లించి దళిత ద్రోహిగా మిగిలారని మండిపడ్డారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని జీవన్‌రెడ్డి  అన్నారు.

Updated Date - 2021-08-17T02:50:31+05:30 IST