కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. ఆ ఇద్దరిపై వైపే మొగ్గు?

ABN , First Publish Date - 2021-01-21T23:31:50+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సీనియర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేసినట్లుగా

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. ఆ ఇద్దరిపై వైపే మొగ్గు?

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సీనియర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ గాంధీభవన్‌కు చేరుకున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. 


రేపు వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థి ఎంపిక కోసం సమావేశం కానున్నారు. రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా సీనియర్లంతా ఆ ఇద్దరి నేతలకే జై కొట్టినట్లు సమాచారం. వరంగల్, నల్గొండ, ఖమ్మంకు రాములు నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయనకే పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వరంగల్ సీటు కోసం మరో నేత బెల్లయ్య నాయక్ పట్టుబడుతున్నారు. అలాగే మహబూబ్ నగర్, హైదరాబాద్, రాంగారెడ్డి అభ్యర్థి ఎంపికపై కూడా తర్జన భర్జన సాగుతోంది. పరిశీలనలో చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, డీపీ స్కూల్స్ చైర్మన్ కేవీఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయి. కానీ సీనియర్లు మాత్రం చిన్నారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. వంశీచంద్ రెడ్డికి నచ్చజెప్పి చిన్నారెడ్డి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.


Updated Date - 2021-01-21T23:31:50+05:30 IST