RS polls: MLAలను రిసార్టులకు తరలిస్తున్న Congress

ABN , First Publish Date - 2022-06-02T16:43:09+05:30 IST

రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించింది. రాజస్తాన్‌లోని ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లోని ఒక రిసార్టులకు తరలించినట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సహకరించే బీజేపీయేతర ఎమ్మెల్యేలను సైతం తీసుకెళ్లినట్లు సమాచారం..

RS polls: MLAలను రిసార్టులకు తరలిస్తున్న Congress

న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీని రాజ్యసభ(Rajya Sabha elections) ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గుబులు పెరుగుతోంది. తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం సరిపోకపోయినప్పటికీ కొన్ని ఎక్కువ సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది బీజేపీ. దీంతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చనే భయం కాంగ్రెస్ పార్టీలో పెరిగింది. అందుకే ఎవరి కంటా పడకుండా రిసార్టులకు తరలించి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది.


రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించింది. రాజస్తాన్‌లోని ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లోని ఒక రిసార్టులకు తరలించినట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సహకరించే బీజేపీయేతర ఎమ్మెల్యేలను సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. హర్యానాలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. హర్యానా కాంగ్రెస్ ముఖ్య నేత భూపిందర్ హూడా సహా 31 మంది ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక రిసార్టులో ఉన్నట్లు సమాచారం. క్రాస్ ఓటింగ్ జరక్కుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు.. ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించడానికి ఇది ఒక కారణమని అంటున్నారు.

Updated Date - 2022-06-02T16:43:09+05:30 IST