పార్టీ కార్యక్రమాలకు Mla దూరం

ABN , First Publish Date - 2022-04-03T16:22:14+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో నాలుగున్నరేళ్లుగా చురుకైన పాత్రను పోషిస్తూ ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు ఆప్తుడిగా కొనసాగుతూ వచ్చిన చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ పార్టీ

పార్టీ కార్యక్రమాలకు Mla దూరం

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీలో నాలుగున్నరేళ్లుగా చురుకైన పాత్రను పోషిస్తూ ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు ఆప్తుడిగా కొనసాగుతూ వచ్చిన చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆయన ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ కార్యక్రమాలలో కనిపించకుండా పోయారు. మేకెదాటు పాదయాత్రను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ముఖ్యులంతా పాల్గొన్నారు. కానీ జమీర్‌ అహ్మద్‌ అటువైపు వెళ్లలేదు. తాజాగా నగరంలోనే పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ రెండు రోజులు గడిపారు. పలు కార్యక్రమాలు, సమావేశాలలో రాహుల్‌ పాల్గొన్నారు. అయితే ఎక్కడా జమీర్‌ అహ్మద్‌ కనిపించలేదు. సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జమీర్‌ అహ్మద్‌ ఇటీవల కొంతకాలంగా సిద్దరామయ్య ముఖ్యమంత్రి అంటూ పదే పదే వ్యాఖ్యానించారు. డీకే శివకుమార్‌కు తీవ్ర అసంతృప్తి చోటు చేసుకోగా హైకమాండ్‌ జోక్యం చేసుకుని అటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయరాదని సర్దుబాటు చేసింది

Updated Date - 2022-04-03T16:22:14+05:30 IST