హైదరాబాద్: తన జన్మదిన వేడుకలను సీఎం కేసీఆర్ చేసుకోవడంలో తప్పేముందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దానికి.. నిరుద్యోగానికి ఏం సంబంధముందని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మాట తప్పినది వాస్తవమేనన్నారు. నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారన్నది కూడా వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు.
త్యాగ గుణం మోదీకి ఉందా ..
యూపీఏ హయాంలో మన్మోహన్సింగ్ను ప్రధానిని చేసిన చరిత్ర ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీది అని జగ్గారెడ్డి అన్నారు. అద్వానీని ప్రధానిని చేసే త్యాగ గుణం మోదీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంక గాంధీలది సెక్యూలరిజమన్నారు. యూపీ సీఎం యోగిది మత రాజకీయమని ఆయన ఆరోపించారు. రాహుల్, ప్రియాంకలపై మాట్లాడే నైతికత బీజేపీ నేతలకు లేదన్నారు.
ఇవి కూడా చదవండి