కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ లేదు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-02-02T23:13:16+05:30 IST

కాంగ్రెస్ లేకుండా దేశంలో ఏ ఫ్రంట్ సాధ్యం కాదని ఎమ్మెల్యే

కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ లేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ లేకుండా దేశంలో ఏ ఫ్రంట్ సాధ్యం కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ బీజేపీ మీదకు తుపాకీ పెట్టి కాంగ్రెస్ వైపు కాలుస్తున్నాడని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలనడం సరికాదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ కోతల రాయుడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు నిధులు తెచ్చే విషయంలో నీ నర్కుడు ఏమైందని సంజయ్ పై ఆయన మండిపడ్డారు. 

Updated Date - 2022-02-02T23:13:16+05:30 IST