Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్, కేసీఆర్ ఇద్దరూ మోదీ తమ్ముళ్లే: జగ్గారెడ్డి

హైదరాబాద్: జగన్, కేసీఆర్ ఇద్దరూ మోదీ తమ్ముళ్లే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, జగన్ నీటి గొడవ పెద్ద డ్రామా అని అన్నారు. జగన్, కేసీఆర్, షర్మిల, విజయమ్మ, బీజేపీ ఎవరి డ్రామా వారు ఆడుతున్నారని విమర్శించారు. మరోవైపు పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలకు నిరసనగా చలో రాజ్‌భవన్ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. పోలీసులు అనుమతిస్తే శాంతియుతంగా చేస్తామని... పోలీసుల చర్యను బట్టి తమ ప్రతిచర్య ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement